HomeTelugu Newsకైరా నెక్ట్స్‌ ఛాయిస్ ఇతనేనా..?

కైరా నెక్ట్స్‌ ఛాయిస్ ఇతనేనా..?

3 9ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్న విజయ్‌దేవరకొండ తన యాటిట్యూడ్‌తో ఈ తరం ప్రేక్షకులను, దర్శక, నిర్మాతలనే కాకుండా పలువురు హీరోయిన్లను సైతం ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి ఓ టీవీ షోలో వెల్లడించింది. తాజాగా కైరా అద్వానీ కూడా విజయ్‌పై తన అభిమానం చాటుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌లోకి భరత్ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ తొలి చిత్రంతోనే కుర్రకారు మదిని దోచేసింది. ఆ క్రెడిట్‌తో రామ్‌చరణ్‌ సరసన వినయ విధేయ రామలో హీరోయిన్‌గా నటించింది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న అల్లు అర్జున్ చిత్రంలోనూ అవకాశం అందుకుంది. టాప్ హీరోల సరసన నటించాలని నియమం పెట్టుకున్నట్టుంది. విజయ్ ఇంటెన్సిటీ, ఫెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్ అంటే తనకు చాలా ఇష్టమని, అర్జున్‌ రెడ్డి సినిమాతో అతడికి వీరాభిమాని అయిపోయానని చెబుతోంది కైరా. అర్జున్‌రెడ్డి హిందీ వెర్షన్లో కైరా హీరోయిన్‌. విజయ్‌ సరసన అవకాశమొస్తే తప్పక నటిస్తానంటూ హింట్ ఇచ్చిందీ భామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu