HomeTelugu Big Storiesచిరంజీవి రాజకీయ జీవితంపై సుదీప్ కామెంట్స్

చిరంజీవి రాజకీయ జీవితంపై సుదీప్ కామెంట్స్

6 15పహిల్వాన్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించిన కిచ్చా సుదీప్ గతంలో వచ్చిన వర్మ చిత్రం రక్త చరిత్రతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆతర్వాత ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమాలో సుదీప్ అవుకు రాజు పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇటీవల విడుదలైన పహిల్వాన్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవి రాజకీయ జీవితంపై సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సైరా మూవీలో చిరంజీవితో కలిసి నటించడం సంతోషంగా ఉందని.. సినిమా ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లకూడదని చిరంజీవిని చూసి నేర్చుకున్నానని.. రాజకీయాలు ఆయన పదేళ్ల సినీ జీవితాన్ని నాశనం చేశాయి. అందుకే నేను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లను అని అన్నారు. భారీ తారాగణంతో తెరకెక్కిన మూవీపై టాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu