HomeTelugu Big Storiesకౌశల్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

కౌశల్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

జూన్ 10న ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి నుండి ఎవరు అవునన్నా కాదన్నా.. కౌశల్‌ తన ఫోకస్ మొత్తం గేమ్ పైనే. నో రిలేషన్స్.. నో ఎమోషన్స్.. ఓన్లీ ఫర్ విన్.. ఇదే కౌశల్ గేమ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో భాగంగానే అతడి నడవడి ప్రవర్తన ఉండేది. ఇది హౌస్‌తో పాటు చాలా మంది ప్రేక్షకులకు కౌశల్‌ను దూరం చేసినా.. టైటిల్ రేస్‌లో అందరికంటే ఒక అడుగు ముందు నిలబెట్టాయి. ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయలేదు. మనోధైర్యంతో, సంకల్పంతో ముందుకు కొనసాగారు. నమ్మిన దాని కోసం ఒంటరి పోరాటం చేశారు. ఏకాకిగానే ప్రయాణించారు. పట్టుదల కోల్పోలేదు. ఎదుటి వారి బలహీనతల్నే తన బలంగా మార్చుకున్నారు. కావాలనే కంటెస్టెంట్‌తో చర్చలకు తెరతీయడం.. ఎక్కడ కెలికితే అది వివాదం అవుతుందో బాగా ఒంటపట్టించుకున్న కౌశల్ పదే పదే కంటెస్టెంట్స్‌కు టార్గెట్ అయ్యాడు ఇదో తరుణంలో మూకుమ్మడి దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ పరిణామక్రమంలోనే ప్రేక్షకుల మద్దతుని కూడగట్టాడు. అయ్యో.. అందరూ కలిసికట్టుగా కౌశల్‌ని టార్గెట్ చేస్తున్నారే అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగేలా తన గేమ్ ప్లాన్‌ని వర్కౌట్ చేసేవారు.

2 35

బిగ్ బాస్ అంటే కౌశల్.. కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న రేంజ్‌లో తోటి కంటెస్టెంట్స్‌ కుళ్లుకుని నువ్ బిగ్ బాస్‌వా? అని తింగరి మొహం వేసేలా డిక్టేటర్‌గా మారి టైటిల్‌ రేస్‌లో టాప్ 1 ప్లేస్‌లో ఉంటూ వచ్చారు కౌశల్. కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్‌లో ఎవ్వరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు కౌశల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనం ఇచ్చాయి. ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ పాపులారిటీ, ఫ్యాన్స్ ఫాలోయింగ్, సోషల్ మీడియాలో పాజిటివ్ ట్రోలింగ్స్ కౌశల్ దే బిగ్ బాస్ టైటిల్.. మరో ఆప్షన్ లేనే లేదు అంటూ బల్ల గుద్ది మరీ చెప్పారు కౌశల్ ఆర్మీ.

ఇకపోతే.. బయట ఇంతమంది అభిమానాన్ని సంపాదించిన కౌశల్.. తనతో పాటు 112 రోజుల పాటు జర్నీ చేసినా ఒక్కరంటే.. ఒక్క హౌస్ మేట్ మనసు గెలుచుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒక్క నూతన్ నాయుడు మాత్రమే కౌశల్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేసినా అందులోనూ నూతన్ స్వార్ధం లేకపోలేదు. కౌశల్‌‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బయట నుండి చూసిన నూతన్ నాయుడు.. కౌశల్‌తో చనువుగా ఉంటే లాభపడొచ్చనే ధీమాతో కౌశల్‌తో దోస్త్ మేరా దోస్త్ అనేవాడు.

Kaushal

కౌశల్ పుట్టింది, పెరిగింది అంతా విశాఖపట్నంలోనే.. బీటెక్ మెకానికల్ చేసిన కౌశల్ పలు తెలుగు సీరియల్స్‌లో నటించాడు. చక్రవాకం , సూర్యవంశం వంటి తెలుగు సీరియల్స్ లో కౌశల్ గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కొన్ని సినిమాల్లో సపోర్ట్ యాక్టర్ గా చేసాడు. నిజానికి వాళ్ళ నాన్న కూడా నటుడే. మోడల్ గా చదివిన చదువుకి అనుగుణంగా ఉద్యోగం చేయాలనీ అనుకుంటుండగా మోడల్ గా ట్రై చేయొచ్చుగా అని కొందరు చెప్పడంతో మోడలింగ్ వైపు అడుగులు వేశాడు కౌశల్‌. ఢిల్లీలో మోడలింగ్ పూర్తి చేసిన వెంటనే అతనికి అవకాశాలు వచ్చాయట. వరుసగా యాడ్స్‌లో నటిస్తూ కౌశల్ ఢిల్లీలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీలో అవార్డు గెలుచుకున్నాడు. కౌశల్ నిజానికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ద లుక్స్ ప్రొడక్షన్ పేరుతో మోడలింగ్ ఏజెన్సీని 1999లో స్థాపించాడు కౌశల్. ఈ కంపెనీ ద్వారా కౌశల్ కోట్లు సంపాదిస్తున్నాడట. బైక్ కంపెనీలు, కార్ల కంపెనీలకు కౌశల్ కంపెనీలో యాడ్స్ క్రియేట్ చేస్తుంటారట. మోడలింగ్, ఫెయిర్ అండ్ లవ్లీ మరియు ల్యాక్ మీ యాడ్స్ అన్ని ఇక్కడే చేస్తారట. పలు యాడ్‌లకు మోడల్స్‌ను అందించిన ఘనత కౌశల్ కంపెనీదేనట. కౌశల్‌ బిగ్‌బాస్‌ విజేతగా నిలబెట్టిన గణత మాత్రం కౌశల్‌ ఆర్మీదే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu