HomeTelugu Big Stories'స‌మ్మ‌త‌మే' ట్రైలర్‌

‘స‌మ్మ‌త‌మే’ ట్రైలర్‌

kiran abbavaram sammathame
టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘స‌మ్మ‌త‌మే’ సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా ‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ చాందినీ చౌదరి నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ జూన్‌ 24న విడుదల కానుంది. మ్యూజికల్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇప్పటికే విడుదలైన టీజర్‌ యూత్‌ను ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి విడుదల చేశారు. ‘ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మీ. వాళ్లు లేని ఇళ్లు ఇలాగే ఉంటుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకునేలా ఉంది. పెళ్లి, అమ్మాయి కోసం ఎదురుచూసే ఓ యువకుడి కథగా ‘సమ్మతమే’ సినిమా అని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ‘చెప్పు నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్‌’, ‘ఇన్నాళ్లు గోల్డ్‌ చైన్‌ వేసుకున్నందుకు ఇన్నాళ్లకు వచ్చిందిరా గోల్డెన్‌ ఆపర్చునిటీ’, ‘నీకు ఏ అమ్మాయి కరెక్ట్‌ కాదు. అద్దంలో మొహం చూసుకుని బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో.’ అంటూ చెప్పై చాలా డైలాగ్‌లు సూపర్బ్‌గా ఉన్నాయి. శేఖర్‌ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu