HomeTelugu Big Stories'ఆదిపురుష్'లో సీత ఈమేనా!

‘ఆదిపురుష్’లో సీత ఈమేనా!

Kriti sanon as heroine in P

యంగ్‌ రెబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ నటించినున్నచిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడిన దగ్గర నుంచీ సంచలనం రేపుతోంది. అటు ఆర్టిస్టుల పరంగా ఇప్పటికే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ప్రభాస్‌ ఈ చిత్రంలో రాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర అయిన హీరోయిన్ సీత పాత్ర విషయమై మొదటి నుంచీ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కీర్తి సురేష్.. అనుష్క శెట్టి.. అనుష్క శర్మ.. ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి.

ఈ సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎంపిక ఇప్పటికే పూర్తయిందని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని కూడా బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం వార్తలొస్తున్నాయి. చెడుపై మంచి సాధించే విజయమే ప్రధానాంశంగా ఈ చిత్ర కథ సాగుతుంది. నాటి రామాయణాన్ని సోషియో ఫాంటసీ కథగా మార్చి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu