HomeTelugu Trendingమెగాస్టార్‌ చెల్లెలుగా ఆ స్టార్‌ హీరోయిన్‌!

మెగాస్టార్‌ చెల్లెలుగా ఆ స్టార్‌ హీరోయిన్‌!

4 27

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో తన 152వ చిత్రం ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరవాత చిరంజీవి తన తదుపరి చిత్రం ‘లూసిఫర్’ ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళంలో మంచి హిటైన ‘లూసిఫర్‌’ సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను ప్రభాస్‌తో ‘సాహో’ దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయనున్నాడు. తెలుగు వర్షన్‌లో ఇక్కడ నెటీవిటికి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట. ఈ సినిమాలో మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా మొన్నటి వరకు తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో సుహాసిని నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఆ పాత్రలో ఖుష్బూ నటించనుందని తెలుస్తోంది. ఖుష్బూ గతంలో స్టాలిన్ సినిమాలో కూడా చిరంజీవి సోదరిగా నటించిన సంగతి తెలిసిందే. కాగా ‘ఆచార్య’ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu