HomeTelugu Trending'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' లిరికల్‌ సాంగ్‌ విడుదల

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

Lachchimi Lyrical from Itl
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న 59వ చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే కథ ఇది. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును విడుదల చేశారు. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించారు. ” నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా .. నా చేతి గీతలో కొత్తరేఖవైనావా .. లచ్చిమీ .. నీ ఎనక ఎనక వస్త కనకలచ్చిమి ” అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ ఆలపించాడు. చాటుతూ నాయకుడు పాడే పాట ఇది. నవంబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu