HomeTelugu Big Stories'లాలా భీమ్లా' వీడియో సాంగ్ ప్రోమో

‘లాలా భీమ్లా’ వీడియో సాంగ్ ప్రోమో

Lala Bheemla Video Promo

పవర్‌ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ , రానా క‌లిసి న‌టిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి ‘లాలా భీమ్లా’వీడియో సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

‘నాగరాజు గారు హ‌ర్టీ కంగ్రాచ్చులేష‌న్స్ అండి.. మీకు దీపావ‌ళి పండుగ ముందే వ‌చ్చేసిందండి ..హ్యాపీ దీపావ‌ళి’అంటూ ప‌వ‌న్ డైలాగ్స్ తో సాగుతున్న ప్రోమో మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉంది.

ఈ మూవీ 2022 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న భీమ్లా నాయ‌క్‌లో కోలీవుడ్ భామ నిత్యా మీనన్, మాలీవుడ్ భామ సంయుక్తా మీన‌న్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu