HomeTelugu Trending'ఆదికేశవ' థర్డ్‌ సింగిల్‌ ప్రోమో

‘ఆదికేశవ’ థర్డ్‌ సింగిల్‌ ప్రోమో

Leelammo Song Promo from Aa 1

వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. పవర్ఫుల్ కంటెంట్ తో .. ఎక్కువ యాక్షన్ పాళ్లతో ఆయన చేసిన సినిమా ఇది. నాగవంశీ – సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం థర్డ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. హీరో .. హీరోయిన్ పై చిత్రీకరించిన ఈ డ్యూయెట్ ‘లీలమ్మో’ అంటూ సాగుతుంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో జోరుగా హుషారుగా సాగే పాట ఇది. ఈ నెల 25వ తేదీన పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు.

జోజు జార్జ్ .. అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. ఒక క్వారీ తవ్వకాలకు అడ్డుగా ఉందనే ఉద్దేశంతో ప్రాచీన కాలంనాటి శివాలయాన్ని పడగొట్టడానికి ఒక బిజినెస్ మెన్ ట్రై చేస్తాడు. అందుకు అడ్డుపడిన ఆదికేశవకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu