HomeTelugu Trendingరకుల్‌ సినిమా షూటింగ్‌పై రాళ్ల దాడి

రకుల్‌ సినిమా షూటింగ్‌పై రాళ్ల దాడి

Locals stone pelted rakul p
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో జాన్‌ అబ్రహాంతో కలిసి ‘అటాక్‌’ సినిమా చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ ఉత్తర ప్రదేశ్‌లోని ధనిపూర్‌లో జరుగుతోంది. అందులో భాగంగా డమ్మీ బాంబ్‌ బ్లాస్టింగ్‌ జరిపారు. దీనికి తగు ముందు జాగ్రత్తలు సైతం పాటించారు. అయితే షూటింగ్‌ గురించి తెలుసుకున్న గ్రామస్తులు సెట్స్‌ వద్దకు చేరుకుని నటీనటులను చూసేందుకు ఎగబడ్డారు.

దీంతో సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు దాడికి దిగారు. సెట్స్‌పైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బంది గాయాలపాలయ్యారు. హీరోహీరోయిన్లకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా అటాక్‌ సినిమా విషయానికి వస్తే…లక్ష్యరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందు ఆగస్టు 13న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu