HomeTelugu NewsInimel: శృతిహ‌స‌న్‌తో ఓరెంజ్‌లో రెచ్చిపోయిన్‌ దర్శకుడు!

Inimel: శృతిహ‌స‌న్‌తో ఓరెంజ్‌లో రెచ్చిపోయిన్‌ దర్శకుడు!

 

Inimel song teaser

 Inimel song teaser: శృతిహాసన్ హీరోయిన్ మాత్రమే కాదు, మంచి పాప్ సింగర్ అని కూడా అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆమె చాలా పాప్ సాంగ్స్‌తో పాటు పలు సినిమాల్లో కూడా పాటలు పాడుతూ అలరిస్తూ వచ్చారు. తాజాగా ‘ఇనిమెల్’అనే ఒక ఆల్బమ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

కమల్ హాసన్ ఈ ఆల్బమ్ సాంగ్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అంతేకాదు పాటకి లిరిక్స్ కూడా ఆయనే రాశారు. ఇక ఈ పాటని కంపోజ్ చేయడం, పాడడం, వీడియోగా తెరకెక్కించే దర్శకత్వ భాద్యతలు అన్ని శృతిహాసన్ తీసుకున్నారు.

ఈ పాటలో మరో ఆసక్తికర విశేషం ఏంటంటే.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ పాటలో శృతిహాసన్ కి జోడిగా నటించాడు. తాజాగా ఈ సాంగ్ టీజర్ ని కమల్ హాసన్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో శృతిహాసన్‌తో లోకేష్ కనగరాజ్ రొమాన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.

ఈ టీజర్‌ చూసిన నెటిజన్లు.. లోకేష్‌లో ఇలాంటి ఓ యాంగిల్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ తో ప్రేక్షకుల్లో ఫుల్ సాంగ్ పై ఆసక్తిని క్రియేట్ చేసారు. ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ ని మార్చి 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. టీజర్ లోనే ఏ రేంజ్ ఉందంటే.. ఫుల్ సాంగ్ లో ఎలాంటి ఉంటుందో అంటున్నారు.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu