HomeTelugu News'మా' వనభోజనాలు

‘మా’ వనభోజనాలు

2 2
హైటెక్‌సిటీలోని టీఎస్‌ఐసీసీ పార్క్‌లో ఆదివారం జరిగిన ‘మా’ అసోసియేషన్‌ వనభోజనాల కార్యక్రమంలో వీరంతా ఆటపాటలతో ఆహ్లాదకరంగా గడిపారు. ‘మా’ ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్‌ నేతృత్వంలో ఈ వనభోజనాల కార్యక్రమం సరదాగా సాగింది. సినీ తారాలతోపాటు మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు అలీ, సురేష్‌ కొండేటి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి హేమ రూ. 25 వేల చెక్కును మా అసోసియేషన్‌కు విరాళంగా ఇచ్చారు. ముగ్గురు మా సభ్యులను దత్తత తీసుకుని వారికి సహాయం చేసేందుకు ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఏటా తను ఈ సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.

ఇటీవల దారుణ హత్యాచారానికి గురైన దిశకు సినీనటులు నివాళులర్పించారు. వనభోజనాలు జరుగుతున్న చోటే ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మానవ సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్ణకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu