పొలిటికల్‌ డ్రామా ‘అర్జున’తో రాజశేఖర్‌

రాజశేఖర్‌ హీరోగా కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున’. ఈ సినిమాలో మరియమ్‌ జకారియా హీరోయిన్‌గా నటిస్తుంది. పొలిటికల్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ పూర్తి కాగా, యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రాజశేఖర్‌ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి యువకుడి పాత్రకాగా, మరొకటి కాస్త వయసు పైబడని పాత్ర. ఇలాంటి పాత్రలు రాజశేఖర్‌ గతంలోనూ నటించి మెప్పించారు. మరి ఇందులో ఆయన‌ నటన ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 15 వరకూ ఆగాల్సిందే. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ ‘కల్కి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.