HomeTelugu Newsమాచర్ల నియోజకవర్గం: ట్రైలర్‌ విడుదల

మాచర్ల నియోజకవర్గం: ట్రైలర్‌ విడుదల

Macherla Niyojakavargam Tra

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ నటించిన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎడిటర్ ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా గుంటూరులోని బ్రోడీపేటలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ట్రైలర్ ను ఆవిష్కరించి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.

‘ఇవాళ వైజాగ్ చాలా కొత్తగా కనిపిస్తోందిరా’ అని నితిన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. వినోదం మరియు యాక్షన్ సమ్మేళనంగా ఉంది. డైలాగ్డ్ అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో కామెడీ – యాక్షన్ – రొమాన్స్.. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని రెడీ చేసినట్లు అర్థం అవుతోంది.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి మరియు నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అంజలి ‘రారా రెడ్డి’ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu