పెళ్ళైన నటి రొమాన్స్ కు సై అంటోంది!

మొన్నా మధ్య ఐశ్వరారాయ్ తనకంటే వయసులో చాలా చిన్నవాడైన రణ్‌బిర్ కపూర్ తో ఓ సినిమాలో రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఆమెను విమర్శిస్తూ చాలా కామెంట్స్ చేశారు. వారి కుటుంబంలో కూడా ఈ విషయమై గొడవలు వచ్చాయని అన్నారు. కానీ ఐష్ మాత్రం దేనిని లెక్క చేయలేదు. ఇప్పుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నట్లుంది నటి కాజోల్. ఆమె కూడా రొమాంటిక్ సీన్లలో నటించడానికి సై అంటోంది. పెళ్లై దాదాపు పదేళ్ళయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయినా.. ఆమె నటిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె ‘విఐపి2’ సినిమాలో నటించింది. 
ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రల్లోనే కాదు.. హీరోయిన్ తరహా పాత్రల్లో కూడా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. అది కూడా గ్లామరస్ గా కనిపిస్తానని హామీ ఇస్తోంది. అంతేకాదు.. రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అటువంటి సీన్లలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించింది. అయితే రొమాంటిక్ సీన్లలో నటించాలంటే.. అవతలి హీరో కుర్రవాడై ఉండాలని మ్యాన్లీగా కనిపించాలని షరతులు విధిస్తోంది. ఎలాగో హీరోలు అలానే ఉంటారు కాబట్టి తెరపై మళ్ళీ కాజోల్ రొమాన్స్ చేయడం ఖాయమనిపిస్తోంది.