HomeTelugu Trendingఎన్టీఆర్‌ బావమరిది 'మ్యాడ్‌' మూవీ ట్రైలర్‌

ఎన్టీఆర్‌ బావమరిది ‘మ్యాడ్‌’ మూవీ ట్రైలర్‌

MAD Official Trailer
ఈ వారం విడుదలౌతున్న సినిమాల్లో ‘మ్యాడ్‌’ ఒకటి. జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నవీన్‌ నార్నే ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి టాక్‌ వచ్చింది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

కాలేజ్‌గ్యాంగ్స్‌, సీనియర్లు, ర్యాగింగ్‌, ప్రేమలు, గొడవలతో సాగింది ఈ సినిమా ట్రైలర్‌. అల్లరి తప్ప చదువు మీద ధ్యాసలేని ముగ్గురు ఇంజనీరింగ్‌ కుర్రాళ్లు చేసే పనులు ఎంత దాకా తీసుకొచ్చాయి. అసలు వాళ్ల గోల్ ఏంటి? చివరికి వాళ్లు సాధించిందేంటి అనే విషయాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని ట్రైలర్‌తో కాస్త క్లారిటీ వచ్చింది.

ముఖ్యంగా కాలేజ్‌ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కే సినిమాలకైతే యూత్‌లో ఓ రేంజ్‌లో హైప్‌ ఉంటుంది. సరైన కంటెంట్‌తో వస్తే మట్టుకు కోట్లు కొల్లగొట్టడం ఖాయం. హ్యాపిడేస్‌, కొత్త బంగారు లోకం, సై లాంటి సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కూడా ఆకోవకు చెందినదే.

సితారా, ఫార్య్చూన్‌ ఫోర్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ముందుగా సెప్టెంబర్‌ 28న రావాలని ఫిక్సయింది. కానీ పోటీగా మూడు సినిమాలు రిలీజ్ కావడంతో రిలీజ్‌ను వారం రోజులు పోస్ట్‌ పోన్‌ చేశారు. ఇక ఈ వారం ఈ సినిమాకు పోటీగా అరడజను సినిమాలు రిలీజ్‌ కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu