
Maha Kumbh Girl Monalisa Car:
ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో అందరికీ తెలిసిందే. ఒక చిన్న ఫోటో కానీ వీడియో కానీ జీవితాన్ని మొత్తం మార్చేసే శక్తి వాటికి ఉంది. అచ్చం ఇలానే జరిగింది మధ్యప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా భోన్స్లేకు. ఒకప్పుడు కుంభ మేళాలో రూ.100కి రుద్రాక్ష మాలలు అమ్ముతూ జీవించేదీ. కానీ ఒక్క ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసింది.
అన్నదమ్ముల్లా కలిసి చిన్న చిన్న రుద్రాక్ష మాలలు అమ్ముతూ పెరిగిన మోనాలిసా, తన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండటానికే చిన్నతనంలో నుంచే పనిచేస్తోంది. ఒకరోజు మేళాలో ఆమె ఫోటో ఎవరో తీశారు. ఆమె చిరునవ్వు, అమాయకత్వం చూసిన నెటిజన్లు మంత్రముగ్దులయ్యారు. ఫోటో వైరల్ అవుతూ వెళ్తూ ఆఫర్లు కూడా వచ్చాయి.
ఆ ఫోటోని చూసిన గాయకుడు ఉత్తర్క్ష్ శర్మ ఆమెను తాను రూపొందిస్తున్న “సాద్గీ” మ్యూజిక్ వీడియోలో నటించాలని కోరాడు. పాట విన్న మోనాలిసాకు అది వెంటనే నచ్చింది. అలా మొదలైంది ఆమె స్టార్ ప్రయాణం.
ఇప్పుడు ఆమెను కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజీలు ఒక విలాసవంతమైన కారు నుండి దిగుతూ చూపిస్తూ పోస్ట్ చేశాయి. ఆ కారు విలువ రూ.1 కోటి పైమాటేనంటూ ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు రూ.100 సంపాదించడానికి మాలలు అమ్మిన అమ్మాయి, ఇప్పుడు కోటి రూపాయల కారులో తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ అదే సోషల్ మీడియా మ్యాజిక్.
మోనాలిసా లాంటి అమ్మాయిలకు ఇది పెద్ద ప్రేరణ. సాధారణ కుటుంబం నుంచి వచ్చినా, టాలెంట్ ఉంటే చాలు – సోషల్ మీడియా ద్వారా అవకాశాలు రావచ్చు. ఇప్పుడు ఆమె ఓ చిన్న మ్యూజిక్ వీడియోతో మొదలు పెట్టినా, భవిష్యత్తులో సినిమాలు, వెబ్ సిరీస్‌ల వరకు వెళ్ళే అవకాశం ఉంది.