HomeTelugu Trending'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి' నుండి తొలి పాట

‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ నుండి తొలి పాట

11 8హీరోయిన్‌ తమన్నా టైటిల్‌ రోల్‌ నటిస్తూన్న చిత్రం ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’. ఈ సినిమా నుండి తొలి పాట విడుదలైంది. మిల్కీబ్యూటీ పెళ్లి నేపథ్యంలో సాగే పాట ఇది. ‘అరె చిన్నా పెద్దా చుట్టూ చేరి పెళ్లి గోల షురూ కారే.. ఈ పిల్లగాడు తెల్లదొరే పల్లకిలోన వచ్చేస్తాడే.. లండనంతా రాసిస్తాడే..’ అని సాగే ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. అమిత్‌ త్రివేది పాటకు సంగీతం అందించారు. ఉత్సాహంగా సాగే ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది.

హిందీ సూపర్‌ హిట్‌ ‘క్వీన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మను కుమారన్‌ నిర్మాత. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇందులో తమన్నా రాజమండ్రి అమ్మాయి పాత్రలో కనిపించి సందడి చేశారు. శివానీ దండేకర్‌, సంజయ్‌ స్వరూప్‌, జగపతిబాబు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రూపొందిస్తున్నారు. తమిళ వెర్షన్‌లో కాజల్‌ నటిస్తున్నారు. ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ అనే టైటిల్‌తో దీన్ని విడుదల చేస్తున్నారు. త్వరలో ఈ రీమేక్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu