HomeTelugu Newsఅదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు..

అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు..

9a 5

ఈరోజు అల్లరి నరేశ్‌ పుట్టిన రోజు ఈ సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. అతడి తాజా చిత్రాలు నాంది, బంగారు బుల్లోడు చిత్రాల టీజర్లు విడుదల అయ్యాయి. ఈ రెండు టీజర్లకు మంచి స్పందన రావడంతో అల్లరి నరేశ్‌తో పాటు చిత్ర బృందాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక నరేశ్‌ బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు అతడికి బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. అంతేకాకుండా నరేశ్‌ కొత్త చిత్రాలకు విషెస్‌ తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా పలు పోస్ట్‌లు పెడుతున్నారు

ముఖ్యంగా నరేశ్‌ స్నేహితుడు నేచరల్‌ స్టార్‌ నాని చేసిన ట్వీట్‌ కొత్తగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ‘అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. నాంది సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నా’ అంటూ నాని ట్వీట్‌ చేశాడు. నానితో పాటు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దగ్గుబాటి రానా, దర్శకుడు హరీష్‌ శంకర్‌, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu