HomeTelugu Big Storiesఇదే నా చివరి సినిమా కావొచ్చు.. ఫ్యాన్స్‌కి మహేష్‌ బాబు షాక్‌

ఇదే నా చివరి సినిమా కావొచ్చు.. ఫ్యాన్స్‌కి మహేష్‌ బాబు షాక్‌

Mahesh Babu comments in the

సూపర్‌ స్టార్ మహేశ్ బాబు హీరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. గతంలో వీరు అతడు, ఖలేజా సినిమాలు చేశారు. అతడు సినిమా మంచి సక్సెస్‌ని సాధించింది. అయితే డిఫెరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఖలేజా మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది.

దీంతో మూడోసారి వచ్చిన గుంటూరు కారంపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పబ్లిక్ టాక్ ఊహించని విధంగా వచ్చింది. ఈ మూవీకి మొదటి షో నుంచి మిక్స్‌డ్ టాక్, రివ్యూలు వచ్చాయి. సినిమా ఎలా ఉన్న మహేశ్ బాబు పర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్‌ అంటున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ ఇరగదీశాడని, డ్యాన్స్‌లో మహేశ్ బాబు విశ్వరూపం చూపించాడని ప్రంశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాపై టాక్ ఎలా ఉన్నా గుంటూరు కారం సినిమాను జనాల్లోకి తీసుకునేందుకు ప్రమోషన్స్ మాత్రం గట్టిగా నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగానే తాజాగా మహేశ్ బాబు, శ్రీలీల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్‌ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడు. ముఖ్యంగా తన డ్యాన్స్ గురించి మాట్లాడాడు. శ్రీలీల మహేశ్ డ్యాన్స్ పై స్పందిస్తూ. ‘మహేశ్ బాబు గారు.. మీరైతే డ్యాన్సులు ఈసారి చించి ఇరగదీశారు. టూ.. టూ.. టూ గుడ్ అండి” అని అంది. దానికి “చించి అవతల పడేశారు” అంది.

Mahesh Babu 1

“ముందు నుంచి నేను, తివిక్రమ్ ఈ సినిమాలో రెండు పాటలు అయితే బాగా చేయాలి అని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే.. దీని తర్వాత రెగ్యులర్‌గా తెలుగు సినిమా పాటలు చేస్తానో తెలియదు. నాకు తెలిసినంతవరకు ఇది నా లాస్ట్ తెలుగు ఫిల్మ్ అయి ఉండొచ్చు. డ్యాన్స్ నెంబర్స్‌లో. డ్యాన్స్ నెంబర్స్ చేసే చివరి సినిమా అవ్వొచ్చు” అని మహేశ్ బాబు అన్నాడు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా మహేష్‌ తన సినిమాల్లో డ్యాన్స్‌ చాలా అరుదుగా చేస్తుంటాడు. రెండు మూడు సినిమాల నుంచి ఎదో ఒకటి రెండు సాంగ్స్‌ డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడు. ఈక్రమంలో ఇకపై డ్యాన్స్‌ చేయకపోవచ్చు అని వెల్లడించాడు. దీంతో తన ఫ్యాన్స్‌ నిరాశ పడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu