HomeTelugu Big Storiesఅమెరికాలో బ్రహ్మానందంకి అరుదైన గౌరవం!

అమెరికాలో బ్రహ్మానందంకి అరుదైన గౌరవం!

అక్టోబర్ 6న అమెరికా లోని సియాటెల్ నగరం లో జరుగబోవు  తస్వీర్ 12 వ  సౌత్ ఏషియన్  ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిధిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోమని   ప్రముఖ నటుడు, పద్మశ్రీ  పురస్కార గ్రహీత , వెయ్యి చిత్రాలతో గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసిన డాక్టర్ బ్రహ్మానందం కి ఆహ్వానం అందింది . ఇదే వేదిక పై అక్టోబర్ 7 న  యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్  బ్రహ్మానందం ని ఘనంగా సన్మానించనుంది . ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని పొందిన రెండో నటుడు ఎస్వీ రంగారావు తర్వాత బ్రహ్మానందం మాత్రమే . 1964 జకార్తా చిత్రోత్సవాల్లో నర్తన శాల చిత్రానికి గాను ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా ఎస్వీఆర్  అవార్డు పొందిన తర్వాత తిరిగి ఇన్నేళ్లకు ఒక తెలుగు నటుడి విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం ముదావహం.
బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ . ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ నిమిత్తం అమెరికా లోనే షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం ఈ ఆహ్వానానికి అంగీకారం తెలిపారు. నిన్ను కోరి చిత్రం తర్వాత ఆచారి అమెరికా యాత్ర చిత్రానికి అమెరికా లో లైన్ ప్రొడక్షన్ చేస్తున్న పీపుల్ మీడియా సంస్థ అధినేత శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ మీడియా కు   ఈ వార్త  తెలియ జేస్తూ  తమ హర్షాన్ని ప్రకటించారు.  తెలుగు వాడి పెదవులపై చెరగని చిర్నవ్వు మన బ్రహ్మానందం గారని , ఇటువంటి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలకు వారు అర్హుడని కొనియాడారు . 

Recent Articles English

Gallery

Recent Articles Telugu