HomeTelugu Trendingఆసుపత్రిలో చేరిన ప్రముఖ మలయాళ దర్శకుడు

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ మలయాళ దర్శకుడు

Malayalam director siddique
ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ ఆస్పత్రిలో చేరారు. సిద్దిఖీ గుండెపోటు రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుండెపోటు రావడంతో సిద్దిఖీని వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దిఖీకి డాక్టర్లు చికిత్స కొనసాగిస్తుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త అప్‌డేట్ రావాల్సి ఉంది.

సిద్దిఖీ ఆస్పత్రిలో చేరారన్న వార్తతో ఆందోళనకు లోనవుతున్నారు అభిమానులు. తమ అభిమాన దర్శకుడు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సిద్దిఖీ తెలుగులో నితిన్‌తో మారో సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోయింది. మలయాళంలో హిట్లర్‌, గాడ్‌ఫాదర్‌, ఫ్రెండ్స్‌, బాడీగార్డ్‌ సినిమాలను తెరకెక్కించాడు సిద్దిఖీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu