HomeTelugu Trendingశాకుంతలం: 'మల్లికా మల్లికా' సాంగ్‌ విడుదల

శాకుంతలం: ‘మల్లికా మల్లికా’ సాంగ్‌ విడుదల

Mallika Mallika song from S
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. ‘మల్లికా మల్లికా .. మాలతీ మాలిక, చూడవా .. చూడావా .. ఏడే నా ఏలిక’ అంటూ ఈ పాట సాగుతోంది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను రమ్య బెహ్రా ఆహ్లాదకరంగా ఆలపించింది. గ్రాఫిక్స్ ద్వారానే ఆవిష్కరించిన ఈ పాట నెటిజన్లు ఆకట్టుకుంటుంది. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. ఇతర పాత్రలలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి నటించారు. వచ్చేనెల 17వ తేదీన ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu