HomeTelugu Trendingహోస్ట్‌గా మంచు మనోజ్?

హోస్ట్‌గా మంచు మనోజ్?

manchu manoj as host

మంచు మ‌నోజ్ రీఎంట్రీ తరువాత ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇటీవ‌లే భూమా మౌనికా రెడ్డిని రెండ‌వ వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని మొద‌లు పెట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో మ‌నోజ్ మ‌రో ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ కోసం ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్న‌ట్లు తెలిస్తుంది.

ఈ ప్రోగ్రామ్ ని ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. మ‌నోజ్ షోకి రెడీ అవుతున్న‌ట్లు టాక్‌. ఇంత‌వ‌ర‌కూ మ‌నోజ్ బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది లేదు. చేసినంత‌కాలం సినిమాలు చేసి గ్యాప్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత కుటుంబ జీవితం..క‌ల‌త‌ల‌తో కొంత డిస్ట‌బెన్స్ కి గుర‌య్యాడు. ఈ క్ర‌మంలో మీడియాకి పెద్ద‌గా క‌నిపించలేదు.

ఇటీవలే మనోజ్‌ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. అవేమి కాదు..మ‌ళ్లీ సినిమాల్లోకే వ‌స్తున్న‌ట్లు మ‌నోజ్ తేల్చి చెప్పేసాడు. అయితే న‌టుడిగా నిల‌దొక్కు కుండానే ఓ ఛాన‌ల్ లో ప్రోగ్రామ్ చేయ‌డం అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu