HomeTelugu Trendingఎన్టీఆర్‌కు విలన్‌గా మంచు మనోజ్‌?

ఎన్టీఆర్‌కు విలన్‌గా మంచు మనోజ్‌?

8 2
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మంచు మనోజ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. పూర్తిగా నెగిటివ్ పాత్ర కాకుండా ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోని ఉపేంద్ర పాత్ర తరహాలో మనోజ్ పాత్రలను డిజైన్ చేసిడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. కాగా మంచు మనోజ్ కొంతకాలం గ్యాప్ తరవాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu