మసూద్‌ అజహర్‌ మరణించాడా?

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అజహర్‌ అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారని.. కాలు కూడా బయట పెట్టే స్థితిలో లేరని పాక్‌ విదేశాంగ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మసూద్‌ అజహర్‌ మృతిపై అనేక కథనాలు వస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది