మెగా చిరంజీవితం 150!

సీనియర్ జర్నలిస్ట్, మెగా కుటుంబానికి అత్యంత ఆప్తుడు అయిన పసుపులేటి రామారావు మెగాస్టార్ చిరంజీవి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ ‘మెగా చిరంజీవితం 150’ అనే పుస్తకాన్ని రచించారు. శనివారం ఈ పుస్తకాన్ని అల్లు అరవింద్, వి.వి.వినాయక్, రామ్ చరణ్ తేజ్ ల సమక్షంలో విడుదల చేశారు. ఈ సంధర్భంగా.. 
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ”పసుపులేటి రామారావు సీనియర్ జర్నలిస్ట్ గా ఇప్పటివరకు ఎవరితో విబేధాలు లేకుండా ఉన్నతంగా జీవిస్తున్నారు. ఆయన చిరంజీవి 150వ సినిమా విడుదలవుతున్నసంధర్భంగా బుక్ రాస్తున్నాను అని చెప్పగానే సంతోషంగా అనిపించింది. కొన్ని ఫోటోలు సేకరించి ఇచ్చాను. అలానే ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ పుస్తకంలో అన్ని కోణాలను కవర్ చేసే ఉంటారని అనుకుంటున్నాను” అన్నారు. 
 
వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ”పసుపులేటి రామారావు గారికి చిరంజీవి గారంటే ఎంత అభిమానమో చిరంజీవి గారికి కూడా అంతే అభిమానం. ఈ బుక్ లో కొన్ని ఫోటోలు, స్టిల్స్ చూస్తుంటే నా గతం గుర్తొస్తుంది. మెగా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే స్వయం కృషి అని బుక్ మీద రాసిన పదం ఒక్కటి చాలు.. ఈ పుస్తకం ఎలా ఉంటుందో చెప్పడానికి” అన్నారు. 
 
పసుపులేటి రామారావు మాట్లాడుతూ.. ”ఈ పుస్తకం తీసుకురావడానికి 25 రోజుల సమయం పట్టింది. చెన్నైలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన జీవితంలో ప్రతి ఘట్టాన్ని ఇందులో ప్రస్తావించాను. ఎవరికి తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి. దాసరి నారాయణరావు గారు కూడా ఈ పుస్తకంలో ఓ పేజీ రాశారు. అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఈ పుస్తకానికి హైలెట్స్” అన్నారు
 
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ”పసుపులేటి రామారావు గారి గురించి మాట్లాడడానికి, ఆయన పక్కన కూర్చునే అర్హత కూడా నాకు ఉందని అనుకోవడం లేదు. ప్రతి ఫీల్డ్ లో ఒకరు టాప్ గా ఉంటారు.. అలా జర్నలిజం కుటుంబంలో టాప్ ఎవరంటే మొదట వినిపించేది పసుపులేటి రామారావు గారి పేరే. ఈ పుస్తకంలో నేను చూడని కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. మా ఇంట్లో లైబ్రరీలో ఈ బుక్ నెంబర్ 1 ప్లేస్ ఉంటుంది. మా కుటుంబం తరఫున రామారావు గారికి కృతజ్ఞతలు” అన్నారు.