HomeTelugu Trendingబిగ్‌బాస్‌ హౌస్‌లో 'గద్దలకొండ గణేష్'

బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘గద్దలకొండ గణేష్’

3 21మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన నటించిన ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) సినిమా కలెక్షన్ విషయంలో దూసుకుపోతుంది. ఇక ఈ వారం ప్రమోషన్స్‌లో భాగంగా ఈయన బిగ్ బాస్ హౌస్‌కు వచ్చాడు. అక్కడే కాసేపు ఉండి సరదాగా నవ్వించాడు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్లను పలకరించాడు వరుణ్ తేజ్. గద్దలకొండ గణేష్‌గా వచ్చాడు కాబట్టి తెలంగాణ యాసలోనే అందరికీ హాయ్ చెప్పి బై చెప్పాడు వరుణ్. ముఖ్యంగా వరుణ్ వచ్చిన తర్వాత నాగార్జున కూడా ఫుల్ జోష్ అయ్యాడు. ఆయన కూడా మాస్ హీరోగా మారిపోయి విజిల్స్ వేసాడు.

ఇక ఇంట్లో ఉన్న హౌస్‌ మేట్స్ కూడా గద్దలకొండ గణేష్ రాకతో మాస్ అయిపోయారు. ఒకర్ని మించి ఒకరు చిందేసారు. సూపర్ హిట్టు నీ హైట్ అంటూ రచ్చ రచ్చ చేసారు. మరోవైపు శ్రీముఖి, హిమజ మన గద్దలకొండ గణేష్‌కు ప్రపోజ్ కూడా చేసారు. ఏదేమైనా ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో గద్దలకొండ గణేష్ రచ్చ మామూలుగా లేదు. ప్రోమోలోనే అంత రచ్చ కనిపిస్తుంటే ఎపిసోడ్‌లో ఇంకెంత చేసుంటారో..?

Recent Articles English

Gallery

Recent Articles Telugu