HomeTelugu Big Stories'ఉప్పెన' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి స్పీచ్‌

‘ఉప్పెన’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి స్పీచ్‌

megastar chiranjeevi speech

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ డెబ్యూ మూవీ ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి తన చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను ఆశీర్వదించేందుకు వచ్చారు. ‘ఉప్పెన’ సినిమా అద్భుతమని చెప్పడం అతిశయోక్తి కాదేమో. మనం ట్రెండీ సినిమాలంటూ మరో రూట్‌లోకి వెళ్లిపోతున్నాం. కానీ మన మట్టి కథలు, మన భూమి కథలు రావాలి. అలా కనుమరుగైపోతున్న మన కథలను గుర్తు చేసిన సినిమా ‘ఉప్పెన’. 80,90ల్లో భారతీరాజా తీసిన సినిమాలు గుర్తుకు వచ్చాయి. ఇది మరో రంగస్థలం అవుతుందనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ కృతిశెట్టి తొలి సినిమానే అయినా చక్కగా నటించింది. వైష్ణవ్‌ తేజ్‌ చాలా చక్కగా నటించాడు. తను మా కుటుంబానికే గర్వకారణం. సినిమాపై ఉన్న ప్రేమ కారణంగానే మైత్రీ మూవీ సంస్థ అందరికీ ఇష్టమైన నిర్మాణ సంస్థగా మారింది” అన్నారు ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించారు. ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మాట్లాడిన సందర్బంగా విజయ్ సేతుపతి గురించి మాట్లాడారు. ఆయన గొప్ప నటుడు అంటూ ప్రశంసలు కురిపించారు. తెలుగులో మీరు మరిన్ని సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. అందరు అన్నది వేరు మెగాస్టార్ అన్నది వేరు అన్నట్లుగా విజయ్ సేతుపతి గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన రేంజ్ ను మరింతగా పెంచేశాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu