HomeTelugu Big Storiesచంద్రబాబు-వైఎస్సార్‌పై దేవకట్ట సినిమా

చంద్రబాబు-వైఎస్సార్‌పై దేవకట్ట సినిమా

Devakatta movie on Chandra

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు-వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి సమ ఉజ్జీగా చెబుతారు. వీరిద్దరు అసెంబ్లీలో ఉన్నప్పుడు రసవత్తరంగా ఉండేది. చంద్రబాబు-వైఎస్ఆర్ మంచి స్నేహితులు కూడా. వీరిద్దరూ మంచి పట్టున్న రాజకీయ నేతలు. వీరిద్దరి స్నేహం, రాజకీయ జీవితంపై దర్శకుడు దేవకట్ట ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. 1980 నుంచి 2000 మధ్య చంద్రబాబు, వైఎస్సార్ మధ్య ప్రయాణం ఎలా సాగిందనే అంశాలపై ముఖ్యంగా ఈ చిత్రం తీయబోతున్నాడు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ను విడుదల చేసి సంచలనానికి తెరలేపాడు దర్శకుడు దేవకట్ట. ‘ఇంద్రప్రస్థం’ అనే టైటిల్‌తో ఉన్న ఈ సినిమా పోస్టర్‌పై చంద్రబాబు, వైఎస్సార్‌ కలిసి ప్రజలకు అభివాదం తెలుపుతున్నట్టుగా ఉంది. అంతేకాకుండా పోస్టర్‌పై `నైతికత మారుతుంది. అధికారం కోసం జరిగే యుద్ధం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది` అంటూ ఓ కొటేషన్ కూడా పెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రొడోస్‌ ప్రొడక్షన్స్ పతాకంపై హర్ష వీ, తేజ సీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu