మెగాస్టార్ కోసం శ్రియ!

ఒకప్పడు దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన నటి శ్రియ.. చాలా కాలం యూత్ ను
తన అందం, అభినయం ఉర్రూతలూగించింది. ఇప్పటికీ అంతే అందాన్ని మైంటైన్ చేస్తూ.. అవకాశాలను
దక్కించుకుంటోంది. సీనియర్ హీరోలకు శ్రియ ఒక ఆప్షన్ గా మారింది. ఇటీవల మనం సినిమాలో
నాగార్జున సరసన, వెంకటేష్ తో గోపాల గోపాల సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు బాలకృష్ణతో
కలిసి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో
కూడా కనిపించబోతోందని టాక్. అదేంటి చిరు ‘ఖైదీ నెంబర్ 150’ హీరోయిన్ కాజల్ కదా..? ఆమెను
తప్పించారా..? అనుకోకండి.. నిజానికి ఈ సినిమాలో ముఖ్యమైన చిన్న పాత్ర ఉందట. దానికోసం
శ్రియ అయితే బావుంటుందని ఆమెను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. గతంలో
చిరు, వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన ‘ఠాగూర్’ సినిమాలో శ్రియ నటించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అదే సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేస్తున్నారు.
CLICK HERE!! For the aha Latest Updates