HomeTelugu Trendingపాటతో మొదలుకానున్న మెగాస్టార్‌ మూవీ షూటింగ్‌

పాటతో మొదలుకానున్న మెగాస్టార్‌ మూవీ షూటింగ్‌

1 7

మెగాస్టార్‌ చిరంజీవి ‘152’వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్ షూటింగును పాట చిత్రీకరణతో మొదలు పెడుతున్నట్టుగా సమాచారం. ఆ దిశగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది ఇంట్రడక్షన్ సాంగ్ కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది ప్రాచీన దేవాలయాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ అని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లు ఉండనున్నారు. ఒక హీరోయిన్‌గా ‘త్రిష’ పేరు వినిపిస్తోంది. మరో హీరోయిన్‌ ఎంపిక జరగవలసి వుంది. ఓ ముఖ్యమైన పాత్రలో ఈషా రెబ్బా కనిపించనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ ను ప్రకటిస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu