Homeతెలుగు Newsమేఘా కృష్ణారెడ్డి ఊరిలో బ్రహ్మోత్సవాలకు హాజరైన పవర్ స్టార్.. ప్రత్యేకతేంటీ?

మేఘా కృష్ణారెడ్డి ఊరిలో బ్రహ్మోత్సవాలకు హాజరైన పవర్ స్టార్.. ప్రత్యేకతేంటీ?

సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లా డోకిపర్రుకు వెళ్లారు. ఈ గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతీయేటా బ్రహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఏడాది జరుగుతున్న బ్రహ్మోత్సవాల కోసం పవన్ కల్యాణ్ నేడు హైదరాబాద్ నుంచి డోక్రిపర్రుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Pawan Kalyan praised Krishnareddy for his services

పవన్ కల్యాణ్ డోక్రిపర్రుకు రాగా ఆయనకు ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. మేఘా కృష్ణారెడ్డి గ్రామంలో కట్టించిన వేంకటేశ్వర ఆలయంలో ప్రతీయేటా బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను మేఘా కృష్ణారెడ్డి ఏర్పాట్లను స్వయంగా మేఘా కృష్ణారెడ్డినే పర్యవేక్షించారు.

డోకిపర్రు మేఘా కృష్ణారెడ్డి స్వగ్రామం. ఈ ప్రాంతం నుంచే ఆయన అంచెలంచెలుగా ఎదిగి పెద్ద వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. మేఘా ఇంజనీరింగ్ నెలకొల్పి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు గుర్తింపు తెచ్చుకొచ్చారు. ఆయన ఆర్థికంగా స్థిరపడ్డాక తన స్వగ్రామమైన డోకిపర్రును ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశారు.

రోడ్లు.. మంచినీటి వసతి.. గ్యాస్‌ సరఫరా తదితర అనేక సదుపాయాలను డోకిపర్రు గ్రామంలో కల్పించారు. గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్నితన సొంత ఖర్చులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రతీయేటా బ్రహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈసారి ఉత్సవాల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనడం ప్రత్యేకతగా నిలిచింది.

పవర్ స్టార్ పవన్ కల్యాన్ నేడు డోకిపర్రుకు రావడంతో గ్రామం సందడి వాతావరణం నెలకొంది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహోత్సవాల్లో పవన్ పాల్గొన్నారు. పవన్ రాకతో జనం భారీ ఎత్తున తరలివచ్చారు. మేఘా కృష్ణారెడ్డి కట్టించిన ఆలయానికి పవన్ ప్రత్యేకంగా రావడంతో కొందరు రాజకీయ ఊహగాలకు తెరదీస్తున్నారు.

అయితే నిజానికి మేఘా కృష్ణారెడ్డికి చిరంజీవి కుటుంబానికి మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. వీరవురి కుటుంబాలు కృష్ణా జిల్లాలో పక్కపక్కనే ఉండేవి. ఈ రెండు ఇళ్ళల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మరో కుటుంబం హాజరవుతూ ఉండేది. అదే సాంప్రదాయాన్ని ఈ ఇరు కుటుంబాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.

దీనిలో భాగంగానే పవన్ కల్యాణ్ బ్రహోత్సవాలకు హాజరైనట్లు తెలుస్తోంది. అంతేతప్ప రాజకీయాలకు సంబంధించిన ఉండకపోవచ్చనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా పవన్ రాకతో డోకిపర్రు గ్రామంలోని బ్రహోత్సవాలకు మరింత కళ వచ్చిందని గ్రామస్థులు ఖుషీ అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu