HomeTelugu Newsకోడెల మృతిపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

కోడెల మృతిపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

7 14మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో కోడెల, చంద్రబాబు తప్పు అంగీకరించారని అన్నారు. గతంలో కోడెల ఇంట్లో బాంబులు పేలినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే కేసులు పెట్టిందని గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు కోడెలను పనిచేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడటంలేదని మంత్రి కొడాలి నాని తెలియజేశారు. కోడెల శివప్రసాదరావు మరణానికి చంద్రబాబు నాయుడే పరోక్ష కారణమని అన్నారు. 10 రోజుల పాటు చంద్రబాబు కనీసం ఆయనకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని, నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. చనిపోయేందుకు ముందు ఉదయం 9 గంటల వరకు కూడా చంద్రబాబుతో భేటీకి కోడెల ప్రయత్నించారని, దానికి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని మంత్రి కోడెల తెలిపారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ప్రభుత్వం కేసులు పెడితే పోరాడే తత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. కోడెలను ప్రభుత్వం వేధించిందంటూ చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఫర్నిచర్, బిల్డర్లు కేసు కానీ ప్రభుత్వం పెట్టింది కాదని.. అసెంబ్లీ ఫర్నిచర్ తన ఇంట్లో ఉందని శివప్రసాద్ అంగీకరించినట్లు మంత్రి గుర్తుచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu