HomeTelugu Big StoriesHari Hara Veera Mallu కన్నా ముందే విడుదల కానున్న మరో పవన్ కళ్యాణ్ సినిమా..!

Hari Hara Veera Mallu కన్నా ముందే విడుదల కానున్న మరో పవన్ కళ్యాణ్ సినిమా..!

OG set for release ahead of Hari Hara Veera Mallu?
OG set for release ahead of Hari Hara Veera Mallu?

Hari Hara Veera Mallu :

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో తన పాత్రను బలపరచడానికి ఆయన సినిమాలకు విరామం ఇచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమాలకు సంబంధించిన పనులు ఆలస్యం అవుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం ప్రారంభంలో.. వేసవికి విడుదలవుతుందని ప్రకటించారు. కానీ, షూటింగ్‌ ఆలస్యం కారణంగా విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ చిత్రం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వస్తూ ఉండడంతో.. ప్రేక్షకుల్లో సైదా మీ సినిమాపై ఆసక్తి తగ్గింది. నిర్మాతలు కూడా ఇంకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్‌ను పూర్తి చేయలేదు.

ఇంకొక వైపు, ‘ఓజీ’ చిత్రం పైన మాత్రం మెగా అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఓజీ’ చిత్రం ‘హరి హర వీరమల్లు’ కంటే ముందుగా విడుదలవుతుందట. ఈ సంవత్సరం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతోంది.

ప్రస్తుతం, ‘ఓజీ’ విడుదల తేదీ ఖరారు అవ్వలేదు. అయితే పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ పూర్తి చేయడానికి ఇంకా పది రోజులు సమయం మాత్రమే అవసరమని సమాచారం. నిర్మాత డీవీవీ దానయ్య అన్ని నాన్-థియేట్రికల్‌ డీల్స్‌ను కూడా పూర్తి చేశారు. ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ ముంబై నేపథ్యంతో స్టైలిష్‌ డాన్‌గా కనిపించబోతున్నారు. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో ‘ఓజీ’ ఈ సంవత్సరం ‘హరి హర వీరమల్లు’ కంటే ముందుగా విడుదల కాబోతుందట.

పవన్‌ కళ్యాణ్‌ మరో చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాదన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు మాత్రం మరో సంవత్సరం పట్టొచ్చు.

ALSO READ: ఈ Tamil Star Hero కి కలెక్షన్లు తక్కువ రెమ్యూనరేషన్ ఎక్కువ

Recent Articles English

Gallery

Recent Articles Telugu