
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. డైరెక్టర్ మహేష్ బాబు పి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బీ టెక్ చేసి స్టాండ్ అప్ కామెడీ ఆర్టిస్ట్ గా హీరో నవీన్ పోలిశెట్టి కనిపిస్తారు. అనుష్క శెట్టి పెళ్లి చేసుకోకుండా, లవ్, పెళ్లి, ఎలాంటి రిలేషన్ షిప్ లేకుండా తల్లి కావాలి అని అనుకుంటుంది. ట్రైలర్ ఫన్ రైడ్ తో బాగుంది.
నవీన్ డైలాగ్స్ బాగున్నాయి. మరోసారి నవీన్ పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ను అలరించనున్నట్లు ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. మురళి శర్మ, అభినవ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రదన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.












