HomeTelugu Big Storiesరజినీకాంత్‌కు మోడీ, చిరంజీవి బర్త్‌డే విషెస్‌

రజినీకాంత్‌కు మోడీ, చిరంజీవి బర్త్‌డే విషెస్‌

Modi Chiranjeevi Birthday
కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఈరోజు ’70వ’ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీ కాంత్‌కు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని తమినాడు వ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లో నేరుగా రంగ ప్రవేశం చేయనున్నట్లు గతవారం పేర్కొన్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లు ట్వీట్టర్‌ వేదికగా ప్రకటించారు. రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో శనివారం నాటి రజనీకాంత్‌ 71వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే మక్కల్‌ మన్రం( రజనీ అభిమాన సంఘం) నిర్వాహకులు భారీ ఎత్తున అభిమానులు ఆయన ఇంటికి చేరుకొని బ్యానర్లు, రజనీ ఫొటోతో ప్రింట్‌ చేసిన టీ షర్టులను ధరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపధ్యంలో రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. అలాగే టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి.. రజనీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అద్భుతంగా జీవించాలని, రాజకీయాల్లో విజయాలు సాధించాలని కోరుకుటున్నాను. మీ ప్రత్యేక శైలి ద్వారా ఎన్నో మిలియన్ల హృదదయాలను గెలుచుకున్నారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రత్యేక స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. అని పేర్కొన్నారు. ఇక తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కూడా శుక్రవారమే రజనీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu