ఎన్టీఆర్ కోసం అనుకున్న పాట చిరుకి వెళ్లింది!

ఇండస్ట్రీలో ఒకరికోసం అనుకున్న కథ మరో హీరోకి వెళ్ళడం, ఆ సినిమా హిట్ కొట్టడం ఇలా జరిగిన సంధర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలానే ఒకరి కోసం అనుకున్న పాటను మరో హీరో సినిమాలో ఉపయోగించి ఆ పాటతో రికార్డ్ సృష్టించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 150వ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఫస్ట్ లుక్, తీజర్, రెండు పాటలను విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడూ’ అనే పాట యూట్యూబ్ లో రికార్స్ సృష్టించింది. నిజానికి ఈ పాటను దేవి.. ఎన్టీఆర్ ‘జనతాగ్యారేజ్’ సినిమా కోసం కంపోజ్ చేశాడట. ఎన్టీఆర్ కు ఈ ట్యూన్ నచ్చకపోవడంతో ‘నేను పక్కా లోకల్’ అంటూ మరో పాట అందించాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కాదన్న పాట చిరుతో ఓకే అనిపించి హిట్ కొట్టాడు దేవిశ్రీప్రసాద్. ఒకరకంగా ఈ పాట అంత హిట్ కావడానికి కారణం చిరంజీవికి ఉన్న క్రేజే..