HomeTelugu Trendingమెగాస్టార్‌కు మోహన్‌ బాబు బర్త్‌డే గిఫ్ట్‌

మెగాస్టార్‌కు మోహన్‌ బాబు బర్త్‌డే గిఫ్ట్‌

Mohan babu gift to chiranje

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి.. నిన్న (ఆగస్టు 22) 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా.. డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న ఆప్త‌మిత్రుడికి బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసి చింర‌జీవి ఎంత‌గానో సంతోషించారు. హార్లీ డేవిడ్‌స‌న్‌ ఆకృతిలో ఉన్న బైక్ ద‌గ్గ‌ర నిలుచుని ఫొటో కూడా దిగారు.

ఆ త‌ర్వాత దాన్ని చిరు ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. “నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజు నాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. నీ బ‌హుమానానికి ధ‌న్య‌వాదాలు” అని రాసుకొచ్చారు. కాగా “చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్” అంటూ మోహ‌న్ బాబు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu