HomeTelugu Big Storiesచంద్రముఖి-2: సెకండ్‌ సింగిల్‌ విడుదల

చంద్రముఖి-2: సెకండ్‌ సింగిల్‌ విడుదల

Moruniye Lyric song from Ch
రాఘ‌వా లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చంద్రముఖి- 2’. పీ వాసు డైరెక్ట్‌ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌ స్వాగతాంజలి సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా చంద్రముఖి 2 నుండి సెకండ్‌ సింగిల్‌ ను లాంఛ్ చేశారు మేకర్స్‌. లారెన్స్‌ డ్యాన్సింగ్ స్టైల్‌తో సాగుతున్న ఈ పాట మూవీ, మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. వివేక్‌ రాసిన ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజిషన్‌లో ఎస్పీ చరణ్‌, హారికా నారాయణ్‌ పాడారు.

చంద్రముఖి 2 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో రాఘవాలారెన్స్‌ రాజసం ఉట్టిపడేలా చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపిస్తున్నాడు. మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేసిన మరో లుక్‌లో రాఘవా లారెన్స్ చంద్రముఖి భవంతి ద్వారంలోకి వెళ్లి.. తలుపులో నుంచి లోపలికి చూస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు, టైటిల్ లుక్ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చంద్రముఖి 2లో లెజెండ‌రీ కమెడియ‌న్ వడివేలు కీ రోల్‌లో నటిస్తున్నాడు. చంద్రముఖి 2 సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu