HomeTelugu Big Storiesదసరా బరిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'

దసరా బరిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

Most eligible bachelor rele

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక దసరా రోజుల్లో మాత్రం ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.తాజా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేశారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇక నుంచి ఈ సినిమా ప్రమోషన్లు జోరందుకుంటాయని చెప్పుకొచ్చారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నిర్మితమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu