ఈ వారం బాక్సాఫీస్ చిత్రాలు!

డిసంబర్ రెండో వారం నుండి మొదలుపెడితే ఏప్రిల్ వరకు పెద్ద సినిమాలు ఏవోకటి విడుదలవుతూనే ఉంటాయి. దీంతో చిన్న చిత్రాలకు సమయం దొరకదని నవంబర్ నుండి వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాయి. కానీ సక్సెస్ రేట్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఈ వారం కూడా మరికొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడికి రెడీ అయిపోతున్నాయి. ముందుగా డిసంబర్ 7న కమెడియన్ కమ్ హీరో సప్తగిరి నటించిన ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. 
 
ఇక చాలా కాలంగా విజయం కోసం పరితపిస్తోన్న హీరో సుమంత్ నటించిన ‘మళ్ళీ రావా’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక నందు-శ్రీముఖి జంటగా నటించిన ‘బీటెక్ బాబులు’ అలానే ‘వానవిల్లు’ అనే మరో రెండు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మరి ఈ వారం ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందో చూడాలి!