HomeTelugu Trending'7డేస్‌ 6 నైట్స్‌' ఫస్ట్‌లుక్‌

‘7డేస్‌ 6 నైట్స్‌’ ఫస్ట్‌లుక్‌

7 Days 6 Nights First Look

సీనియర్ నిర్మాత కం దర్శకుడు ఎం.ఎస్.రాజు స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 7డేస్ 6 నైట్స్. అది ఓ ఒంటరి దీవి. అక్కడ ఒడ్డున చేరిన రెండు కయాక్ (పడవ)లు. ఆ రెండూ ఖాళీగా ఉన్నాయి. అంటే ఆ దీవిలో ఎవరో ఉన్నారు. వాళ్లు ఎవరు? ఏం చేస్తున్నారు? ఇంతకీ వారి లక్ష్యం ఏమిటి? ఇవన్నీ తెరపై చూపిస్తారని అర్థమవుతోంది. అయితే ‘డర్టి హరి’ మూవీని మించి సంథింగ్ ఉంటుందని ఎం.ఎస్.రాజు ఆల్రెడీ చెప్పారు కాబట్టి.. ఇందులో రొమాన్స్ పీక్స్ లో ఉంటుందనే అర్థమవుతోంది. ఇక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ కేటగిరీలో మిస్టరీ నేపథ్యంతో స్క్రీన్ ని వేడెక్కించేందుకు ఎం.ఎస్.రాజు గట్టి స్క్రిప్టునే ఎంచుకున్నారు. జూన్ 7 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ – ఏబిజి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమంత్ అశ్విన్- రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. హైదరాబాద్… గోవా.. మంగుళూరు.. అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ చేస్తారు. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచింది టీమ్. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu