ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు!

దూకుడు సినిమాలో కొంచెం సమయం పొలిటికల్ లీడర్ గా కనిపించిన మహేష్ బాబు ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడని సమాచారం. అసలు విషయంలోకి వస్తే మహేష్ హీరోగా కొరటాల శివ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో మన ప్రిన్స్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని టాక్. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఓ సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే కొరత శివ కథతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. కాబట్టి సహజంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో అంటే ఈ సినిమాపై అంచనాలు ఓరేంజ్ లో పెరగడం ఖాయం.
Attachments area
CLICK HERE!! For the aha Latest Updates