HomeTelugu Newsరజనీ మూవీ టైటిల్‌ అది కాదు!

రజనీ మూవీ టైటిల్‌ అది కాదు!

10 11డైరెక్టర్‌ ఏ.ఆర్ మురుగదాస్‌ త్వరలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ‘నార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులపై తాజాగా మురుగదాస్ ట్విటర్‌ ద్వారా స్పందించారు. తన తర్వాతి ప్రాజెక్ట్‌ టైటిల్‌ ‘నార్కలి’ కాదని స్పష్టం చేశారు. టైటిల్‌ ప్రకటించేంతవరకు అభిమానులు ఓపికపట్టాలని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని సూచించారు.

ఈ కొత్త సినిమా గురించి గతంలో మురుగదాస్‌ మాట్లాడుతూ.. రజనీకి కథ చెప్పానని, ఆయన నుంచి ఫోన్‌కాల్‌ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఫాంటసీ చిత్రంగా దీన్ని తెరకెక్కించబోతున్నట్లు కూడా చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. ఇందులో రజనీకి జోడీగా కీర్తి సురేశ్‌ నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. సినిమాలో కథానాయిక పాత్రకు ఆమె బాగా సరిపోతారని చిత్రబృందం భావిస్తోందట. ఇటీవల రజనీ నటించిన ‘పేట’ చిత్రం విడుదలై మంచి విజయం అందుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu