రాఘవేంద్ర కొత్త సినిమా ప్రకటన.. ప్రయోగం ఫలిస్తుందా?

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక గౌరవం ఉంది. ఆయన తీసే సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. హీరోయిన్లను చూపించే విధానం ఆయనకు మాత్రమే సాధ్యం అవుతుంది. పూలు, కాయలు లేకుండా సినిమా చేయడు. 2017 లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ తరువాత ఇప్పటి వరకు సినిమా చేయలేదు. ఏదైనా వైవిధ్యభరితమైన సినిమాతో గౌవరంగా సినిమా రంగం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాడు అందుకే అయన ఎన్టీఆర్ పుట్టినరోజున ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లు ఒక హీరో.. త్వరలోనే సినిమా అని ప్రకటించారు.

ఒక హీరోతో ముగ్గురు హీరోయిన్ల వరకు ఒకే. గతంలో రాఘవేంద్ర రావు ఇలా చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ముగ్గురు దర్శకులు అనే సరికి అందరు షాక్ అయ్యారు. పైగా బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో సినిమా ఉంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం ముగ్గురు దర్శకులు మూడు కథలకు దర్శకత్వం వహిస్తారు. అందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఫైనల్ గా ఎలా దానిని క్లబ్ చేస్తారన్నది పాయింట్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాఘవేంద్రరావ్‌ లేదంటే సినిమా నిర్మాతలోగాని ప్రకటించాలి.