HomeTelugu Trending'ముసలోడికి దసరా పండుగ' ట్రైలర్‌ విడుదల

‘ముసలోడికి దసరా పండుగ’ ట్రైలర్‌ విడుదల

Musalodiki Dasara Pandaga M
సీనియర్‌ నటుడు నాజర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. డి. మనోహర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాజీనాయుడు, సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణ వాళ్లె నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను నాజర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’ అన్నారు. రమణ వాళ్లె మాట్లాడుతూ.. ‘రెండు గంటలపాటు హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది. త్వరలో ఈ మూవీ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నాకు తండ్రి సమానులైన దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణగారికి అంకితం ఇస్తున్నాను’అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu