HomeTelugu Trendingసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భేటీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భేటీ

Rajinikanth Clarifies Politics Entry And Dissolves Rajini Makkal Mandram

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మంగళవారం ఉదయం పోయెస్‌ గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటికి వెళ్లి  కలిశారు. ఇద్దరూ చాలా సేపు ముచ్చటించుకున్నారు. అనంతరం ఇళయరాజా తిరిగి బయలుదేరుతుండగా ఏదైనా పనిపై వచ్చారా స్వామి..? అని రజనీకాంత్‌ అడగగా ఏమీ లేదు జూన్‌ 2వ తేదీన కోయంబత్తూరులో సంగీత కచేరీ ఉందని, దీనికి సంబంధించి తన స్టూడియోలో రిహార్సల్స్‌ జరుగుతున్నాయని, ఒక్కడినే వెళుతున్నట్లు చెప్పారు.

దీంతో రజనీకాంత్‌ తానూ వస్తానంటూ కారులో ఇళయరాజా రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లారు. అక్కడ కొంచెం సేపు రిహార్సల్స్‌ను ఎంజాయ్‌ చేశారు. ఇంతకీ ఇళయరాజా సడన్‌గా రజనీకాంత్‌ ఇంటికి ఎందుకు వెళ్లారు? వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.. కాగా రజనీ కాంత్‌, ఇళయరాజా కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే.

image 23

Recent Articles English

Gallery

Recent Articles Telugu