HomeTelugu Big Storiesఆర్‌ఆర్‌ఆర్‌:‘నాటు నాటు’ సాంగ్ ప్రోమో

ఆర్‌ఆర్‌ఆర్‌:‘నాటు నాటు’ సాంగ్ ప్రోమో

Naatu Naatu Song Promo from

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి బుధవారం ఉదయం రెండో పాట విడుదల కానుంది. ఫుల్‌ మాస్‌ డ్యాన్స్‌తో సాగే ఈ పాట లిరికల్‌ ప్రోమోని ఈ రోజు (మంగళవారం) ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు’అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌-తారక్‌ పవర్‌ఫుల్‌ స్టెప్పులతో అదరగొట్టేసినట్లు అర్థమవుతోంది. కీరవాణి సంగీతం అందించగా.. రాహుల్‌ సిప్లింగంజ్‌, కాల భైరవ హుషారెత్తించేలా ఆలపించారు.

డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. ఆలియాభట్‌, శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరీస్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu