HomeTelugu Trendingనాగచైతన్య 'ధూత' ట్రెండింగ్

నాగచైతన్య ‘ధూత’ ట్రెండింగ్

Naga Chaitanya Dhootha trenDhootha: నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో నటించిన వెబ్‌ ప్రాజెక్టు ‘ధూత’ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్‌ 1న స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది విక్రమ్ కుమార్ టీమ్.

నాగచైతన్యతో పాటు పార్వతి తిరువొత్తు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్‌, విక్రమ్‌ కే కుమార్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ధూత టీమ్ పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. దీనికి సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ ప్రాజెక్టులో పార్వతి తిరువొత్తు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ధూత ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య ముంబైలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా సందడి చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu